అలర్ట్: ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

అలర్ట్: ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

హైదరాబాద్ : సిటీలో మళ్లీ వర్షం దంచికొడుతోంది. చాలా ఏరియాల్లో వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు ఎండకొట్టగా… ఒక్కసారిగా సిటీని మబ్బు కమ్మేసింది. దీంతో చల్లబడిన వాతావరణం… చాలా ఏరియాల్లో వర్షం కురుస్తుంది. చార్మినార్, బేగం పేట, మలక్ పేటతో పాటు చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు పడుతయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని…..దాని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మరో 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే చాన్సుందన్నారు అధికారులు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి 22వ తేదీ వరకు భారీగా వర్షాలు పడతాయని.. ముఖ్యంగా ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది వాతావరణశాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు.. ఢిల్లీ IMD సీనియర్ అధికారు రాజేంద్రకుమార్ జెనామని. ఇవాళ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో అక్కడక్కడా వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే చాన్సుందన్నారు. దీంతో ఓల్డ్ సిటీ ప్రాంతాల్లోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే 10 రోజులుగా చాలా కాలనీలు వర్షంలో నానుతున్నాయి. కనీసం నిత్యవసర వస్తువులు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. దీంతో చాలా మంది ప్రజలు పస్తులుంటున్నారు.