నేడు రాష్ట్రంలో అక్కడక్కడా వానలు

నేడు రాష్ట్రంలో అక్కడక్కడా వానలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం పొడి వాతావరణం ఏర్పడొచ్చని చెప్పింది. గురువారం గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ పరిధిలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు చినుకులు పడ్డాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కుమ్రంభీం జిల్లాలోని గిన్నెదారిలో 16.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.