
‘కాలుష్య ప్రభావం రాబోయే తరాలపై ఎక్కువగా ఉంటుంద’ని చెప్తుంటారు. గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 90 లక్షలమంది చనిపోతున్నారు. ఇది ఎక్కువగా కట్టడాలు, వాహనాలు, వంట గది, ధూమపానం, ఇండస్ట్రీస్, కాల్చిన చెత్త నుంచి వస్తుంది. వీటినుండి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌లు తల్లి కడుపులోని పిండంపై ప్రభావం చూపుతాయని స్టడీలు చెప్తున్నాయి.
- పిండం ఎదుగుదలలో లోపాలు, గర్భ స్రావం, పుట్టిన పిల్లల్లో ఆస్తమా, ఆటిజం, గుండె సమస్యల్లాంటివి ఎదురయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు రీసెర్చర్లు.
- ఊపిరితిత్తులు, గుండె, మెదడు సరిగ్గా ఎదగకపోవడం, నెలలు నిండకముందే బిడ్డ పుట్టడం లేదా పుట్టిన కొన్ని రోజులకే బిడ్డ చనిపోవడం కూడా గాలి కాలుష్యం వల్ల జరుగుతాయి.
- తల్లి, పిండంలో బ్లడ్ ప్రెజర్ పెరిగి కడుపులోనే బిడ్డ చనిపోయే అవకాశం ఉంటుంది. గాలి కాలుష్యం వల్ల ఆడ, మగవాళ్లలో సంతానోత్పత్తి తగ్గుతుంది.
- గర్భిణులు ఈ సమస్యకు దూరంగా ఉంటూ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇంట్లో, వంట గదిలో ఎయిర్ ప్యూరిఫైయర్లని పెట్టుకోవాలి. బయట తిరిగేటప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్ మాస్క్‌లు వాడాలి.
- ఇంట్లో గాలిని శుభ్రం చేసే మొక్కలు పెంచుకోవాలి. పొల్యూషన్ లెవల్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సివస్తే తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలి.