రాష్ట్రంలో మాంద్యం ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ కనిపిస్తలేదు

రాష్ట్రంలో మాంద్యం ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ కనిపిస్తలేదు
  • పలు శాఖల్లో పెరిగిన ఆదాయం
  • కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లో రూ. 580 కోట్ల అదనపు రెవెన్యూ
  • రిజిస్ట్రేషన్ల శాఖలో  557 కోట్ల నెలవారీ ఆదాయం
  • ఆర్టీఏలో మాత్రం కొంత డౌన్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంతో ఆదాయం తగ్గుతోంది. రాష్ట్రంలో మాత్రం దాని ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. కొన్ని డిపార్ట్​మెంట్లలో గతంకంటే ఈసారి ఆదాయం పెరగడం విశేషం. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులైన కమర్షియల్‌‌‌‌‌‌‌‌  ట్యాక్స్‌‌‌‌‌‌‌‌, స్టాంప్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌  రిజిస్ట్రేషన్స్‌‌‌‌‌‌‌‌ విభాగాల్లో  రెవెన్యూ రాబడి భారీగా పెరిగింది. ఆటోమొబైల్స్‌‌‌‌‌‌‌‌ రంగం కాస్త నెమ్మదించడంతో ఆర్టీఏ ఆదాయం మాత్రం స్వల్పంగా తగ్గింది.

‘కమర్షియల్‌‌‌‌‌‌‌‌’లో జోష్..

రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరైన కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ లో మంచి ఆదాయం వస్తోంది. ఆగస్టు నెలలో పెట్రోల్‌‌‌‌‌‌‌‌, లిక్కర్‌‌‌‌‌‌‌‌ తో కలిపి రూ. 4,256 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇందులో పెట్రోల్‌‌‌‌‌‌‌‌పై రూ. 839 కోట్లు, లిక్కర్‌‌‌‌‌‌‌‌పై రూ. 800 కోట్లు, జీఎస్టీ, ఇతర విభాగాల నుంచి రూ. 2,617 కోట్ల ఇన్‌‌‌‌‌‌‌‌కం వచ్చింది. గతేడాది ఈ నెల ఆదాయం రూ. 3,676 కోట్లు మాత్రమే. అంటే సుమారు రూ. 580 కోట్లు అదనంగా సమకూరాయి. కేంద్రం నుంచి స్టేట్‌‌‌‌‌‌‌‌ వాటా జీఎస్టీ సొమ్ము రావాల్సి ఉంది. మొత్తంగా చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆగస్టు వరకు రూ.19,035 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్​పై పన్నుల నుంచి రూ. 3,704 కోట్లు, లిక్కర్‌‌‌‌‌‌‌‌ నుంచి 4,080, జీఎస్టీ, ఇతర అంశాల నుంచి రూ. 11,251 కోట్లు ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు వచ్చిన రాబడి రూ. 17,378 కోట్లు మాత్రమే. డీలర్లకు నోటీసులు జారీ చేయడం, పన్నులు చెల్లించని వారిపై దాడులు పెంచడం, ప్రభుత్వం విభాగాలతో వన్‌‌‌‌‌‌‌‌ టైం సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేయడం వల్లే ఆదాయం పెరిగిందని ఉన్నతాధికారులు అంటున్నారు.

రిజిస్ట్రేషన్ల శాఖలోనూ మంచి ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగానే ఉంటుందని తొలుత కొందరు భావించారు. కానీ ఆ శాఖలో ఆదాయం బాగానే సమకూరింది. ఆగస్టులో 557 కోట్ల 90 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ. 201 కోట్లు, మేడ్చల్‌‌‌‌‌‌‌‌–మల్కాజిగిరిలో రూ. 112 కోట్లు సమకూరింది. ఈ నెల మొత్తం 1.49 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. కుమ్రం భీం జిల్లాలో అత్యల్పంగా 52 లక్షల రాబడి వచ్చింది. ఇక్కడ కేవలం 387 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. గతేడాది ఆగస్టులో మొత్తంగా 1.26 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌కాగా.. వచ్చిన ఆదాయం రూ. 492.05 కోట్లు  మాత్రమే. అంటే ఈసారి రూ. 65.84  కోట్లు అదనంగా సమకూరింది. మొత్తంగా చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల ఏడో తేదీ వరకు మొత్తం 2,832 కోట్లు రాగా.. 7,50,111 డాక్యుమెంట్లు రిజిస్టరయ్యాయి. రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ వ్యాపారంలో మెరుగుదల, కొత్త ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు రావడం, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ శివారు ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలు భారీగా జరగడంతో ఆదాయం పెరిగినట్టు అధికారులు చెప్తున్నారు.

ఆర్టీఏలో మాత్రం డౌన్

కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖల్లో ఆదాయం బాగానే వచ్చినా.. ఆర్టీఏలో మాత్రం కాస్త తగ్గింది. ఆగస్టులో 80,212 వాహనాలు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ కాగా రూ. 174 కోట్ల ఆదాయం సమకూరింది. 2018 ఆగస్టులో 1,06,478 వాహనాలు రిజిస్టరై రూ. 210 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఆదాయం రూ. 36 కోట్లు తగ్గింది. జులైలోనూ పెద్దగా ఆదాయం రాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 1,341 కోట్ల రెవెన్యూ సమకూరింది. దేశవ్యాప్తంగా ఆటోమొబైల్‌‌‌‌‌‌‌‌ రంగంలో అమ్మకాలు 12శాతం తగ్గాయని, దాంతో ఆర్టీఏకు అనుకున్నంత ఆదాయం రాలేదని ఆ శాఖ అధికారులు తెలిపారు.

the impact of the economic downturn does not on Telangana State