రన్నింగ్ కారులో మంటలు

రన్నింగ్ కారులో మంటలు

గండిపేట్,వెలుగు :  రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కాలిపోయిన ఘటన  శివరాంపల్లిలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి ఆరాంఘర్‌ నుంచి జూపార్క్‌ వైపు హఫీజ్, పర్వీన్‌ ఇన్నోవాలో వెళ్తున్నారు. శివరాంపల్లికి చేరుకోగానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. వెంటనే హఫీజ్, పర్వీన్‌ కారు దిగి బయటకు వచ్చారు. చూస్తుండగానే నిమిషాల్లో కారు కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వచ్చి మంటలను ఆర్పేశారు.