భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శిశువు తారుమారు !

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శిశువు తారుమారు !

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శిశువు తారుమారు ఘటన కలకలం రేపుతోంది. మగ శిశువుకు బదులుగా ఆడశిశువును ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగింది..? 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కాటాయి గూడెం గ్రామానికి చెందిన ఉష, రాజేష్ దంపతులకు మూడవ సంతానంగా శనివారం (అక్టోబర్​ 21న) రాత్రి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శిశువుకి జన్మనిచ్చింది. డెలివరీ చేసిన వైద్యులు, సిబ్బంది ఉష చేతి మీద ఆడ శిశువు అని మార్క్ వేశారు. ఉష భర్త, బంధువులకు ఆ పాపను అప్పగించారు. అనంతరం శిశువుని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లారు.

అక్కడి నుండి శిశును తిరిగి బంధువులు తీసుకునేటప్పుడు కన్ఫ్యూజన్​ నెలకొంది. తాము మగ శిశువును ఇస్తే ఆడ శిశువును ఇస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు విచారణ చేపట్టి ఆసుపత్రిలోని సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ మొదలుపెట్టారు. వైద్యులు మాత్రం ఆసుపత్రిలో శిశువు తారుమారు అయినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదంటున్నారు.