ఏటీఎం క్యాష్ వెహికల్​తో పరార్

ఏటీఎం క్యాష్ వెహికల్​తో పరార్

గండిపేట, వెలుగు: ఏటీఎం మెషీన్​లో పెట్టాల్సిన క్యాష్ బాక్సులతో వెహికల్ డ్రైవర్ పరారైన ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. రైటర్స్ సేఫ్ గార్డ్ సంస్థ కెనరా బ్యాంక్ ఏటీఎం సెంటర్లలో క్యాష్​ను డిపాజిట్ చేసేందుకు  సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తోంది. బోరబండకు చెందిన ఫరూఖ్ రెండ్రోజుల కిందట ఫేక్ ఆధార్ కార్డును ప్రూఫ్​గా చూపించి రైటర్స్ సేఫ్ గార్డు సంస్థలో డ్రైవ
ర్​గా చేరాడు. గురువారం రాజేంద్రనగర్​లోని కెనరా బ్యాంక్ ఏటీఎం సెంటర్​లో క్యాష్​ పెట్టేందుకు బ్యాంక్ సిబ్బంది అశోక్, భాస్కర్, సెక్యూరిటీ సిబ్బంది కేవీ రామ్, చంద్రయ్య రూ.72 లక్షలతో ఫరూఖ్​తో​ కలిసి వెహికల్​లో బయలుదేరారు. బ్యాంక్, సెక్యూరిటీ సిబ్బంది క్యాష్​ బాక్సులతో ఏటీఎం సెంటర్ లోపలికి వెళ్లారు. షట్టర్ క్లోజ్ చేసి మెషీన్​లో క్యాష్ డిపాజిట్ చేసి బయటికి వచ్చి చూసేసరికి వెహికల్​తో పాటు ఫరూఖ్​ కనిపించలేదు.

వెహికల్​కు ఉన్న  జీఎపీఎస్ ను తొలగించిన ఫరూఖ్ బుద్వేల్ మీదుగా కిస్మత్ పురా బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. రూ.3 లక్షలున్న క్యాష్​ బాక్సుతో పాటు సెక్యూరిటీ సిబ్బందికి చెందిన రెండు గన్లు తీసుకున్నాడు. వెహికల్​ను రోడ్డు పక్కన వదిలేసి పారిపోయాడు. జీపీఎస్ చివరి సిగ్నల్​ను ట్రేస్ చేసిన సేఫ్ గార్డు ఏజెన్సీ నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో  రాజేంద్రనగర్ ఎస్ వోటీ పోలీసులు కిస్మత్ పురా రూట్​లో గాలించారు. బ్రిడ్జి దగ్గరి వెహికల్​ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. క్యాష్ బాక్సుల్లో ఒకటి మాత్రమే లేదని.. మిగతావి అలాగే ఉన్నాయని బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.