ఒకే కథతో రెండు సినిమాలు.. ఒకటి మొదలైంది.. రెండోది రిలీజ్కు రెడీ

ఒకే కథతో రెండు సినిమాలు.. ఒకటి మొదలైంది.. రెండోది రిలీజ్కు రెడీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో వస్తున్న పాన్ ఇండియా మూవీ "ది ఇండియా హౌస్". 2023 మే 28న అఫీషియల్ గా స్టార్ట్ అయిన ఈ సినిమాను రామ్ చరణ్తో పాటు.. విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ‘వీర్ సావర్కర్’ కథకు లింక్ ఉన్న కథతో ‘ది ఇండియా హౌజ్’ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో నిఖిల్ ‘శివ’ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్ర అనౌన్స్మెంట్ వీడియోకి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే, ది ఇండియా హౌజ్ చిత్ర యూనిట్ కి షాక్ ఇస్తూ మరో సినిమా కూడా ‘వీర్ సావర్కర్’ కథతో తెరకెక్కుతోంది. బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ రణదీప్ హుడా కూడా వీర్ సావర్కర్ కథతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆయనే స్వయంగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘సావర్కర్’. ఈ ఏడాదిలోనే ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ నుండి  టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా ఈ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, కుదిరామ్ బోస్ లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ను  ప్రేరేపించిన గొప్ప నాయకుడు సావర్కర్. అలాంటి నాయకుడి కథని ఎవరు, ఎందుకు చంపేసారు? అంటూ ‘సావర్కర్’ టీజర్ ని సూపర్బ్ గా ప్రెజెంట్ చేసాడు రణదీప్ హుడా. ఈ టీజర్ కు కూడా ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది.

మరి ఒకే పాయింట్ తో రానున్న ఈ రెండు  సినిమాల మధ్య పోలికలు ఉంటాయా? లేక పాయింట్ ఒకటైనా ప్రెజెంటేషన్ వేరేగా ఉండనుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.