మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు 

మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు 

వచ్చే మూడు రోజులు దేశంలోని 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ ఘఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో పశ్చిమ బెంగాల్ లోని కోస్తా జిల్లాలైన పుర్బా, పశ్చిమ మేదినీపూర్ లో ఇవాళ్టి నుంచే వానలు పడ్తాయని ప్రకటించింది. 

డార్జిలింగ్, కలింపొంగ్ ప్రాంతాల్లో రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.ఉత్తరాఖండ్ కుమాన్, గర్హాల్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అల్ప పీడన ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వానలు పడ్తాయని అధికారులు తెలిపారు.