నాలుగో టెస్టులోనూ చేతులెత్తేస్తున్న భారత బ్యాట్స్ మెన్

నాలుగో టెస్టులోనూ చేతులెత్తేస్తున్న భారత బ్యాట్స్ మెన్
  • టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ చేపట్టిన భారత్, స్కోర్ 28/2

ఓవల్: ఇంగ్లండ్-భారత జట్ల మధ్య జరుగుతున్న నాలుగో  టెస్టులోనూ భారత బ్యాట్స్ మెన్ చేతులెత్తేస్తున్నట్లు కనిపిస్తోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ ప్రారంభించి 13 ఓవర్లు ముగిసే సరికి 28పరుగులకు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. సెకండ్ టెస్ట్ హీరో రాహుల్ లూజ్ బాల్స్ ను బౌండరీ దాటిస్తూ జాగ్రత్తగా ఆడగా..  రోహిత్ శర్మ కూడా అదేబాటలో జాగ్రత్తగా ఆడే ప్రయత్నంలో తడబాటుకు గురై ఇంగ్లండ్ ఆటగాళ్ల ముందు చేతులెల్తేశారు. మ్యాచ్ 9వ ఓవర్ లో క్రిస్ వోక్స్ వేసిన చివరి బంతికి రోహిత్ శర్మ (11) కీపర్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా పుజారా వచ్చాడు. 
నాలుగు ఓవర్లు గడచినా స్కోరో బోర్డు ఏమాత్రం కదల్లేదు. దీంతో సహనం కోల్పోయినట్లు కనిపించిన కెఎల్ రాహుల్ ఒత్తిడికి లోనైనట్లు కనిపించింది. అనుకున్నట్లే 13.5 ఓవర్ వద్ద రాబిన్ సన్ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో భారత్ స్కోరు 28 పరుగులకే రెండో వికెట్ గా రాహుల్ (17)ను కోల్పోయింది. పుజారాకు జోడీగా కెప్టెన్ కోహ్లి బరిలోకి దిగాడు. మూడో టెస్టు మ్యాచు లో ఇంగ్లండ్ ను ఏ మాత్రం నిలువరించలేక చేతులెత్తేసి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. నాలుగో టెస్టు చూస్తుంటే అదే పరిస్థితి పునరావృతం అవుతుందా అనే అనుమానం కలుగుతోంది.