దుబాయ్ బీచ్లో టీమిండియా సందడి

దుబాయ్ బీచ్లో టీమిండియా సందడి

ఆసియాకప్లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా..సూపర్ -4కు అర్హత సాధించింది. అయితే  సూపర్ 4 రౌండ్‌కు  ముందు దొరికిన కాస్త  సమయాన్ని టీమిండియా ఆస్వాదించింది. దుబాయ్ బీచ్‌లో భారత జట్టు సందడి చేసింది.  కోచ్  ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, చాహల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా.. జట్టు మొత్తం దుబాయ్ బీచ్‌లో సేదతీరింది. కొందరైతే బీచ్లో వాలీబాల్ ఆడుతూ సరదాగా గడిపారు. ఇక రోహిత్ శర్మ కయాకింగ్ చేస్తూ ఎంజయ్ చేయగా.. విరాట్ కోహ్లీ టాప్‌లెస్‌లో మెరిశాడు.

సరదాగా గడిపిన ఆటగాళ్లు..
సూపర్- 4కు అర్హత సాధించడంతో ఖాళీ సమయాన్ని జట్టు సభ్యులు ఆటవిడుపుకు ఉపయోగించుకున్నారు. సముద్రంలో రోయింగ్ చేస్తూ, బీచ్ వాలీబాల్ ఆడుతూ రీఫ్రెష్ అయ్యారు. టీంలోని ఆటగాళ్లందరూ సరదాగా సమయాన్ని గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 

వరుస విజయాలతో జోష్..
ఆసియా కప్‌ 2022లో టీమిండియా అదరగొడుతోంది. గ్రూప్-ఏలో భాగంగా తొలుత చిరకాల ప్రత్యర్థి పాక్ను ఓడగొట్టింది. ఆ తర్వాత హంకాంగ్ను చిత్తు చేసి..సూపర్ 4కు క్వాలిఫై అయింది.గ్రూప్-ఏలో ఇవాళ  పాకిస్తాన్.. హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు రెండు జట్లు ఒక్క మ్యాచ్లోనూ గెలవలేదు. అయితే ఇందులో గెలిచిన జట్టు సూపర్ 4లో భారత్‌ను ఢీ కొడుతుంది.