
బర్మింగ్ హామ్: కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల జోరు కొనసాగుతోంది. మంగళవారం అర్థరాత్రి మలేషియాతో జరిగిన బాట్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో 3-1 తేడాతో ఓడిన భారత జట్టు రజతం గెలుచుకుంది. దీంతో తాజాగా భారత్ ఖాతాలో 13వ పతకం వచ్చి చేరింది. పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవ్వడంతో భారత్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
President Droupadi Murmu & PM Narendra Modi congratulate the Indian badminton team for winning a silver medal in #CommonwealthGames2022 pic.twitter.com/PfUedRBLbY
— ANI (@ANI) August 3, 2022
ఇండియన్ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లో చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డిలు పోరాడి ఓడారు. ఆ ఇద్దరూ టెంగ్ ఫాంగ్, వూయి ఇక్ చేతిలో 21-18, 21-15 స్కోర్‌తో ఓడిపోయారు. ఇక రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 22-20, 21-17 తేడాతో జిన్ వెయి గోపై విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 19-21, 21-6, 16-21 స్కోర్‌తో నెగ్ తెజ్ యాంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ మ్యాచ్ గంటా ఆరు నిమిషాలు సాగింది. నాలుగవ మ్యాచ్‌లో ట్రెస్సా జాలీ, గాయత్రి గోపిచంద్ ఓడిపోయారు. కాగా... విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు అభినందనలు తెలిపారు.
Another Silver for INDIA ??
— Jagat Prakash Nadda (@JPNadda) August 3, 2022
The Indian #Badminton Mixed Team bags a silver medal?at #CWG2022 by putting up a noteworthy performance. Our athletes continue to make us proud. Congratulations to the entire team. pic.twitter.com/C4f95Pf8Mh