ఈ నెల 12 నుంచి 14 వరకు టై గ్లోబల్‌ సమ్మిట్‌

ఈ నెల 12 నుంచి 14 వరకు టై గ్లోబల్‌ సమ్మిట్‌

హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతోంది. డిసెంబర్ 12న నోవాటెల్ HICCలో ది ఇండస్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ (TiE) గ్లోబల్‌ సమ్మిట్‌ జరగనుంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ గ్లోబల్‌ సమ్మిట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి అడోబ్‌ సిస్టమ్స్‌ సీఈఓ శంతను నారాయణ్‌, గోయెంకా గ్రూప్‌ సీఈఓ, ఎండీ అనిల్‌ కుమార్‌ చలమలశెట్టి హాజరవనున్నారు. ఏడోసారి జరుగుతున్న ఈ గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రపంచ వ్యవస్థాపక అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు.

ది ఇండస్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ (TiE) గ్లోబల్‌ సమ్మిట్‌లో 17 దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు, 550 మందికిపైగా టీఐఈ చార్టర్‌ మెంబర్స్, 150 మందికిపైగా ఇంటర్నేషనల్ స్పీకర్స్‌, 200 మందికిపైగా పెట్టుబడిదారులు హాజరవనున్నారు. ముఖ్యంగా ఉడాన్‌.కామ్‌, అర్బన్‌ లేడర్‌, డ్రూమ్‌, షాప్‌ క్లూస్‌,  బిరా 91 తదితర పారిశ్రామిక వేత్తలు ఇందులో పాల్గొనే అవకాశముంది.