నేటి నుంచి జేఈఈ మెయిన్స్‌

నేటి నుంచి జేఈఈ మెయిన్స్‌

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా  ఐఐటీ,ఎన్‌ ఐటీల్లో ఇంజినీరింగ్‌ , ఆర్కిటెక్చర్‌‌ కోర్సుల్లో అడ్మి షన్లకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రెన్స్‌‌ ఎగ్జామినేషన్స్‌‌(జేఈఈ) మెయిన్‌ -2 ఆన్​లైన్ పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 20వరకు కొనసాగనున్నాయి. హైదరాబాద్‌ , కరీంనగర్‌‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌‌, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్‌‌, కోదాడ, నిజామాబాద్‌ లలో 25 పరీక్ష కేంద్రాలు, ఏపీలో 24 ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటుచేశారు. దేశవ్యాప్తంగా 9.34 లక్షల మంది, తెలంగాణ, ఏపీ నుంచి సుమారు 1.50లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అడ్మి ట్‌ కార్డుతో పాస్‌ పోర్టు సైజ్‌ ఫోటో,ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లిన వారికే పరీక్ష హాలులోకి అనుమతి ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌ టీఏ) ప్రకటించింది. జనవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్‌ -1 పరీక్ష ఫైనల్ ఫలితాలు ఏప్రిల్‌‌ 30న, ఇప్పుడు జరగబోయే మెయిన్‌ -2 పరీక్ష ఫలితాలను మే 15న వెల్లడించనున్నట్టు ఎన్టీఏ తెలిపింది.