
ప్రముఖ యాంకర్ సుమ(Anchor Suma). తన యాంకరింగ్కు ఫిదా అవ్వని ఇండస్ట్రీ మ్యాన్ ఉండరంటే నమ్మరు. సుమ తనదైన మాటలతో..పద్దతిగా కనిపిస్తూ..సినిమా ప్రమోషన్కి వారధిలా నిలబడుతుంది.
తనకు ఇచ్చే రెమ్యునరేషన్కు మించి న్యాయం చేసే టాలెంట్ ఉన్న యాంకర్ అంటే.. ఒక్క సుమ అని చెప్పుకోక తప్పదు.సుమ చేసే టీవీ షోస్ అయినా, సినిమా ఈవెంట్ అయినా..ఎటువంటి కార్యక్రమాన్ని అయిన చాలా చక్కగా..ఎనర్జిటిక్‍గా నడిపిస్తారు. తాను హోస్ట్ చేసే పద్దతికే అందరు ఫిదా అవుతారు.
తాజాగా సుమ మాటలతో.. మీడియా వారి మనసును నొచ్చుకునేలా చేసింది. వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆదికేశవ(Aadikeshava) సినిమాలో మూడో పాట అయిన లీలమ్మో సాంగ్ లాంచ్ ఈవెంట్ బుధవారం (అక్టోబర్25) హైదరాబాద్‍లోని ఓ హోటల్‍లో జరిగింది.
Media personnel were irked with Anchor Suma at #Aadikeshava’s song launch event for making fun of them. A journalist in particular asked her to be within limits and to avoid making fun of media people. pic.twitter.com/FiujXijd4v
— Aakashavaani (@TheAakashavaani) October 25, 2023
ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ పలికిన మాటపై..ఓ జర్నలిస్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుమ మాట్లాడుతూ.. మేం ఈవెంట్లో పెట్టిన స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారో ఏమో!..తొందరగా లోపలికి వచ్చి..మీమీ కెమెరాలను ఇక్కడ పెట్టండి. ముందుగా కెమెరా పెట్టిన అతను..మరో ముగ్గురికి చెప్పి..పెట్టించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామని జర్నలిస్టులను ఉద్దేశించి సుమ అన్నారు.
సుమ ఇంటెన్షన్ చూస్తుంటే..అందరూ రావాలంటూ సరదాగా చెప్పే క్రమంగా..ఆమె ఇలా అన్నారని విషయం తెలుస్తోన్న..దీంతో స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారంటూ కామెంట్‍పై ఓ జర్నలిస్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ఈవెంట్ స్టార్ట్ అయ్యాక..సదరు జర్నలిస్ట్ మాట్లాడుతూ..మీరూ హోస్ట్గా చేసిన ప్రతి షో బాగుంటుంది. కానీ, మీడియా వాళ్ల విషయంలో మీరు పలికిన..'స్నాక్స్ భోజనంలా చేస్తున్నారని..మీడియా వాళ్లను అన్నారు చూశారా..ఆ మాట మాత్రం మాకు సంతృప్తిని ఇవ్వలే అంటూ తెలిపారు. దీంతో సుమ రియాక్ట్ అవుతూ..జోక్‍గా తాను అన్నానని, అందరూ తనకు చాలా ఏళ్ల నుంచి తెలుసు కదా అని..సుమ వివరించారు. నా మాటలు బాధ కలిగించి ఉంటే చాలా సారీ. ఇలా అనడం నా ఉద్దేశం కాదని” సుమ చెప్పారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వగా..సుమ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ..సుమ అంత అర్ధం వచ్చేలా అని ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Words War Between Film Journalist and Anchor #Suma At #Aadikeshava Song Launch event pic.twitter.com/nf6Ld5GO8R
— Tollywood insights (@Tollywoodinsigh) October 25, 2023
ఆ తర్వాత సుమ ఇదే విషయంపై..ఓ వీడియో రిలీజ్ చేసి మాట్లాడుతూ..'మీడియా మిత్రులందరికీ నమస్తే..తాజా ఈవెంట్ లో నేను చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని భాధ పెట్టాయని అర్ధమైంది. నిండు మనసుతో అందరినీ క్షమాపణ కోరుతున్నాను..ఎన్నో ఏళ్లుగా అందరం కలిసి పనిచేస్తున్నాం. మీ కుటుంబ సభ్యురాలిగా భావించి మనస్ఫూర్తిగా క్షమిస్తారని ఆశిస్తున్నా..అంటూ ట్వీట్ చేసింది. దీంతో వాగ్వాదం సద్దు మణిగింది.
Anchor #Suma apology video to the Media and Film Journalists https://t.co/KUaKr8wzyX pic.twitter.com/goM6Qdnyav
— Daily Culture (@DailyCultureYT) October 25, 2023
ఇక, ఆదికేశవ నుంచి మూడో పాట లీలమ్మో లిరికల్ రిలీజ్ అవ్వగా..క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఈ హుషారైన మాస్ బీట్ పాటకు వైష్ణవ్ తేజ్, హీరోయిన్ శ్రీలీల అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ఈ లీలమ్మో పాటను నకాశ్ అజీజ్, మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ పాడగా.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. శ్రీకాంత్ ఎన్.రెడ్డి డైరెక్ట్ చేస్తున్నఆదికేశవ సినిమా నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్ కానుంది