కాళేశ్వరం మట్టి నేషనల్ హైవే పైకి..

కాళేశ్వరం మట్టి నేషనల్ హైవే పైకి..

మహదేవపూర్, వెలుగు:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకే కాదు కాళేశ్వరం వచ్చే భక్తులకూ ఇబ్బందులు తప్పట్లేదు. ఆఫీసర్లు కన్నేపల్లి పంపు హౌస్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు వాటర్ లిఫ్టింగ్ కోసం 13.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తవ్వారు. తవ్వగా వచ్చిన మట్టిని కెనాల్​కు ఇరువైపులా 10 మీటర్ల ఎత్తులో పోశారు. కెనాల్ నేషనల్ ​హైవే 363​ని క్రాస్ చేసేచోట మట్టి వర్షాలకు రోడ్డు పైకి కొట్టుకు వచ్చింది. సోమవారం హైవే పై 100 మీట్లర్ల మేర బురద పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.