దేశవ్యాప్తంగా వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన ది కేరళ స్టోరీ(The kerala story) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్నే అందుకుంది. చాలా చోట్ల ఈ సినిమాని బ్యాన్ చేసినా.. కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. అయితే.. ఈ వివాదాలు అదా శర్మకి మాత్రం బాగా కలిసొచ్చాయి అని చెప్పాలి. ఈ సినిమాతో ఆమెను వరుస ఆఫర్స్ పలకరిస్తున్నాయి.
నిజానికి ఈ సినిమాలో ఆమె నటనకి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. దీంతో చాలా మంది మేకర్స్ తమ తరువాత సినిమాల కోసం ఆమెను సంప్రదిస్తున్నారు. ది కేరళ స్టోరీ మూవీ విడుదలై వారం రోజులైనా కాకముందే మరో కొత్త మూవీలో ఛాన్స్ దక్కించుకుంది అదా. శ్రేయాస్ తల్పడే హీరోగా బాలీవుడ్ లో 'ది గేమ్ ఆఫ్ గిర్గిత్' అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం చాలా మందినే అనుకున్నారట మేకర్స్. కానీ చివరకు ఆ అవకాశం అదా శర్మకు దక్కింది.
కెరీర్ స్టార్టింగ్ లో వరుస ఆఫర్స్ మరియు సూపర్ హిట్స్ అందుకున్న అదా.. ఆ క్రేజ్ ను ఎక్కువ కాలం నిలుపుకోలేక పోయింది. అలా ఆమెకు క్రమంగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు ది కేరళ స్టోరీ చిత్రంతో.. అదా శర్మ మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇకనుంచైనా ఆమె వరుస ఆఫర్స్ దక్కించుకుంటుందా? లేదా? అనేది చూడాలి మరి.