సమత కుటుంబానికి మూడెకరాల భూమి

సమత కుటుంబానికి మూడెకరాల భూమి

ఖానాపూర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్యకు గురైన సమత కుటుంబానికి ప్రభుత్వం మూడెకరాల సాగుభూమిని కేటాయించింది. ఈ మేరకు భూమి హక్కు పత్రాలను సోమవారం స్థానిక తహసీల్దార్ జె.నారాయణ బాధితురాలి భర్తకు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ… ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామ శివారులోని 108 సర్వే నెంబర్ లో మూడెకరాల సాగుభూమిని కేటాయించామని చెప్పారు.