అతి పెద్ద విమానం నాలుగోసారి సక్సెస్​ఫుల్​గా టెస్టింగ్

అతి పెద్ద విమానం నాలుగోసారి సక్సెస్​ఫుల్​గా టెస్టింగ్

ప్రపంచంలోనే అతి పెద్ద విమానం స్ట్రాటోలాంచ్ మరోసారి ఆకాశంలో విహరించింది. ఇప్పటికే మూడుసార్లు టెస్ట్ చేసిన ఈ భారీ విమానాన్ని నాలుగోసారి సక్సెస్​ఫుల్​గా టెస్టింగ్​ పూర్తి చేశారు. 383 అడుగుల రెక్కల విస్తీర్ణంతో ఫుట్‌‌బాల్ గ్రౌండ్ పిచ్ పొడవు కంటే పొడవుగా హెచ్​ ఆకారంలో ఉంది. దీని వెడల్పు 50 అడుగులు. స్ట్రాటోలాంచ్ కాలిఫోర్నియాలోని మోజావే ఎయిర్ అండ్ స్పేస్ పోర్ట్ నుంచి బయలుదేరి రెండు గంటల పాటు కాలిఫోర్నియా ఎడారి మీదుగా ఎగిరింది. గరిష్టంగా 15,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఇది గంటకు 178 మైళ్ల వేగంతో ప్రయాణించింది. కాగా, దీని హైస్పీడ్​ గంటకు 530 మైళ్ల వరకు ఉంటుంది. బోయింగ్ 747లో ఉపయోగించే ఇంజిన్‌‌నే దీనికి కూడా ఉపయోగించారు. దీని బరువు సుమారు 500,000 పౌండ్లు. మైక్రోసాఫ్ట్​ సహ వ్యవస్థాపకుడు పాల్​ అలెన్ 2011లో స్ట్రాటోలాంచ్​ అనే కంపెనీని స్టార్ట్​ చేసి ఈ విమానాన్ని అభివృద్ధి చేశారు. కంపెనీ స్టార్టింగ్​లో ప్రాజెక్టు ఖర్చు 300 మిలియన్​ డాలర్లుగా అంచనా వేయగా, 2019లో ప్రాజెక్టు అంచనా వ్యయం 400 మిలియన్​ డాలర్లకు పెరిగింది. తొలిసారిగా 2019 ఏప్రిల్​లో ఈ విమానం టేకాఫ్ అయ్యింది. 2021లో రెండుసార్లు టెస్ట్​ రన్​ చేశారు.