
న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్‌కు భారత స్పేస్ రెగ్యులేటర్ ఇన్‌స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్) నుంచి ఆమోదం లభించింది. దీంతో ఇండియాలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు చివరి అడ్డంకి తొలగింది.
స్టార్‌లింక్ జనరేషన్ 1 కాన్‌స్టెలేషన్‌కు 2030 వరకు అనుమతి లభించింది. ఇందులో 27.5–30 గిగాహెడ్జ్ (అప్‌లింక్), 17.8–19.3 గిగాహెడ్జ్(డౌన్‌లింక్) ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లు ఉన్నాయి. స్టార్‌లింక్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్) నుంచి జీఎంపీసీఎస్ లైసెన్స్‌ను ఇప్పటికే పొందింది.
ఎటెల్‌సాట్ వన్‌వెబ్, జియో తర్వాత భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు ఆమోదం పొందిన మూడో కంపెనీగా నిలిచింది. స్టార్‌లింక్ ఇప్పుడు స్పెక్ట్రం సేకరించి, మూడు గేట్‌వే స్టేషన్లు నెలకొల్పి, భద్రతా పరీక్షలు పూర్తి చేయాలి.