లీడర్లు ప్లాన్..రూ.30 కోట్ల విలువైన భూమిని కొట్టేశారు!

లీడర్లు ప్లాన్..రూ.30 కోట్ల విలువైన భూమిని కొట్టేశారు!

శ్మశానవాటికల కోసం సర్కారు ఓ వైపు పేదల భూములను గుంజుకుంటుంటే, అధికార పార్టీ నేతలు ఏకంగా 30ఏళ శ్మశానాలన్నే మాయం చేశారు. సీలింగ్ యాక్ట్ కింద సర్కారుకు ఏనాడో సరెండర్ చేసిన భూమిని మొదట వారసుల పేర్ల పైకి మార్చి, కొద్దికొద్దిగా అమ్ముకుంటున్నారు. కరీంనగర్ స్లో రూ.30 కోట్ల విలువైన 8ఎకరాల భూమిని కొట్టేయడం వెనుక కీలక ప్రజా ప్రతినిధుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 30 ఏళ్లుగా కబ్జాకాలమ్లో శ్మశానవాటికఅని ఉన్న భూమి, మూడు నెలల్లో అన్యాక్రాంతం కావడం వెనుక ఆఫీసర పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

30 ఏళ్ల నుంచి శ్మశానవాటికగా..

కరీంనగర్శివారులో బొమ్మకల్ బైపాస్ను ఆనుకుని వివిధ సర్వే నంబర్లలో స్తరించిన తన 8 ఎకరాల భూమిని మాజీ ఎమ్మెల్యే నలుమాచు కొండయ్య లాండ్ సీలింగ్ యాక్ట్కింద ప్రభుత్వానికి సరెండర్ చేశారు. 30 ఏళ్లుగా రెవెన్యూ రికార్డుల్లో ఇది శ్మశానవాటికగానే ఉంది. బొమ్మకల్ కేంద్రంగా అధికారపార్టీ నేతల అండదండలతో టీ ప్రభుత్వ భూములను కబ్జాచేస్తున్న భూమాఫియా కండ్లు భూములపై పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే వారసులంతా హైదరాబాద్లో ఉంటున్నా రు. దీంతో అధికారపార్టీకి చెందిన కీలక నేత అనుచరుడు, స్థానిక ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి, వారసులను సంప్రదించాడు. పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ ఇచ్చాడు. కొండయ్య వారసులు భూకబ్జాల్లో ఆరితేరిన మరో లోకల్ లీడర్ను సంప్రదించారు. ఈయన మొదటి వ్యక్తి కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ఆఫర్ చేశాడు. ఇరు వర్గాల నడుమ వివాదం తీవ్రమైంది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నా రు. చివరకు కరీంనగర్లో అధికార పార్టీకి చెందిన కీలక ప్రజా ప్రతినిధి రంగంలోకి దిగి, ఇరువర్గాలను పిలిచి సె టిల్మెంట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్సీకి కొంత భూమి అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. లీడర పేర్లుమీదికి రాకుండారికార్డుల్లో మార్పుచేర్పులు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనులుచకచకా పూర్తి చేయించారు. ఇందుకు ఆఫీసర్లు అన్నివిధాలా సహకరించారు.

కొండయ్య చనిపోయిన పదేళ్లకు..

మాజీ ఎమ్మెల్యే కొండయ్యకు భార్య మనోరమ, ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లుఉన్నారు. కొడుకు 1994 లో మరణించారు. 2006లో ఆయన భార్య, 2009లో కొండయ్యచనిపోయారు. ఇక ఆయనకు వారసులుగా ఉన్నది కూతుళ్లుమాత్రమే. ఒక వేళ భూమి ఉంటే కొండయ్య బతికున్నపుడు లేదా చనిపోయిన వెంటనే విరాసత్ కోసం అప్లైచేసుకోవాల్సి ఉండె. కానీ అలా జరగలేదు. సాధారణంగా విరాసత్ ఏడాది, రెండేళలోపే చేసుకోవా ్ల లి. పదేళ్లపాటు ఎవరూ ఈ భూముల జోలికి రాలేదు. పైగా సర్కారుకు సరెండర్ చేసిన భూములను విరాసత్ చేసే అధికారం ఆఫీసర్లకు లేదు. కానీ అధికార పార్టీ లీడర్లే దగ్గరుండి మరీ అధికారులతో ఈ తప్పుడు పనిచేయించారని తెలుస్తోంది. ఇందుకు ఆఫీసర్లకు కూడా పెద్దమొత్తంలో ముట్టినట్లు తెలుస్తుంది.

మూడు నెలల్లోనే..

శ్మశానం పేరిట ఉన్నభూమిని తమ పేరిట విరాసత్ చేయాలని 2019 అక్టోబర్ 1న తహసీల్దార్ కు కొండయ్య ఇద్దరు కూతుళ్లు అర్ పెజీ ట్టుకున్నా రు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం సర్వే నంబర్ 724/డీ లోని 4.20 ఎకరాల్లో చెరో ఎకరం పట్టా చేశారు. ఈ ఏడాది మార్చిలో మరోసారి అప్లైచేసుకోవడంతో 724/డీ లో మిగిలిన 2.20 ఎకరాలను.. 722/బీ లో ఉన్న 3.20 గుంటలను కొండయ్య కూతుళ్ల పేరుమీద చేశారు. మొత్తంగా 722/బీ, 724/డీ రెండు సర్వే నంబరలో ఉన్న ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని ఇలా అన్యాక్రాంతమైంది. తర్వాత గత నెల 4న నలుగురు వ్యక్తులకు రెండెకరాల 10 గుంటల భూమిని అమ్మేశారు. అదే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే ఆ నలుగురు వ్యక్తులు ఇందులోని 30 గుంటల భూమిని అధికార పార్కిటీ చెందిన ఓ నేత బినామీకి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ ద్వారా అమ్మారు. ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా అమ్మేలా పక్కాప్లాన్తో ముందుకుపోతున్నారు. కళ్లెదుట ఇంత జరుగుతున్నా ఆఫీసర్లకు చీమ కుట్టినట్టుకూడాలేదు. ఉన్నత స్థాయిలో కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ చేపడితేనే ఇందులో భాగస్వాములైన అందరి బాగోతాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి.