వేట అంటేనే జంకుతున్నసింహాలు..

వేట అంటేనే జంకుతున్నసింహాలు..

ఇట్ల ఇంకా చాలానే ఎగ్జాంపుల్స్‌‌ ఉన్నాయి. ఎందుకిట్ల సింహాలు మనుషులున్న ప్రాంతాల్లోకి వస్తున్నాయి? వచ్చినా కుక్కలను, మనుషులను, జంతువులను చూసి భయపడుతున్నాయి? ముందుకు దూకాల్సింది బోయి.. వెనక్కి తగ్గుతున్నాయి. అంటే వాటికి వేటాడే స్కిల్స్‌‌ పోయినయంట. అలవాటు తప్పినయంట. గుజరాత్‌‌లోని గిర్‌‌ ప్రొటెక్టెడ్‌‌ శాంక్చుయరీలో వైల్డ్‌‌ లైఫ్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ ఇండియా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సింహాలు వేటాడటం మరిచి చనిపోయిన వాటిని తిని బతుకుతున్నాయని సర్వే చెప్పింది.

ఎందుకిట్ల అవుతోంది?

సింహాలు ఎక్కువగా వేటాడే ఆహారం సంపాదించుకుంటాయి. తిండిని వెతుక్కుంటూ చాలా దూరం కూడా పోతాయి. కానీ ఇప్పుడెక్కువగా ఫారెస్టులోని టూరిజం జోన్లనే కనబడుతున్నాయి. ఎందుకంటే ఈజీగా తిండి దొరుకుతుంది మరి. అక్కడికొచ్చే టూరిస్టులు వాటికి అవసరమైన తిండిని అందిస్తున్నరు. పైగా టూరిజం ఆఫీసర్లు కూడా వాటిని ఆకర్షించేందుకు ఎరలాగా తిండిని వేస్తున్నరు. ‘గిదేదో మంచిగుందే.. తిండి ఈజీగా, వేటాడకుండనే దొరుకుతుందే’ అని సింహాలు కూడా టూరిజం జోన్‌‌ చుట్టే తిరుగుతున్నాయని, వేటాడే అలవాటును మర్చిపోతున్నాయని డబ్ల్యూఎల్‌‌ఐ చెప్పింది. ప్రస్తుతమున్న పిల్ల సింహాలకు అసలు వేటాడటమే పెద్దగా తెలియదని, టూరిస్టులేసే తిండికి అలవాటు పడిపోయాయని పేర్కొంది. టూరిస్టులు తగ్గి తిండి దొరకనప్పుడు మనుషులుండే ప్రాంతాలకు సింహాలు వస్తున్నాయని, అక్కడైతే కట్టేసిన జంతువులు ఈజీగా దొరుకుతాయని వాటికి తెలుసని వివరించింది. ఇదిట్లే కొనసాగితే మనుషుల ప్రాణాలకూ డేంజరంటోంది.