
సుడిగాలి సుధీర్ తన తరువాతి సినిమా కోసం క్రేజీ హీరోయిన్ ను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుధీర్ కెరీర్ లో 4వ సినిమాగా రానున్న ఈ మూవీని.. కొత్త దర్శకుడు నరేష్ లీ డైరెక్ట్ చేస్తున్నాడు. పక్క మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా కోసం.. తమిళ భామ దివ్య భారతి (Divya Bharathi)ని ఫిక్స్ చేశారట మేకర్స్.
తమిళ సూపర్ హిట్ సినిమా బ్యాచిలర్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు తన తరువాత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. సుధీర్ సినిమాలో దివ్య భారతి హీరోయిన్ అని ప్రకటించడంతో.. యూత్ ఆడియన్స్ ఫస్ట్ అప్డేటే అదుర్స్ అంటు కామెంట్స్ చేస్తున్నారు. ఈ బ్యూటీ మూవీలో ఉందంటే.. గ్లామర్ రచ్చ మాములుగా ఉండదూ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఏదైనా.. దివ్య భారతి ఎంట్రీతో మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరుకొన్నాయి. ఈ ఒక్క అప్డేట్ తోనే సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది. మహాతేజా క్రియేషన్స్ అండ్ లక్కీ మీడియా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమా కూడా సుధీర్ గత చిత్రం గాలోడు లాగానే సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.