కామిక్ ఆర్ట్ వెర్షన్ లో.. ప్రాజెక్ట్ K స్టోరీ

కామిక్ ఆర్ట్ వెర్షన్ లో.. ప్రాజెక్ట్ K స్టోరీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas) హీరోగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'ప్రాజెక్ట్ K'. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆశలున్నాయి. జూలై 19న రిలీజ్ చేసిన మార్వెల్ హీరోలా ప్రభాస్ ఫస్ట్, హాలీవుడ్ హీరోయిన్ ​లా దీపిక లుక్స్​  ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. ప్రాజెక్ట్ K టీం ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ ను కామిక్​ బుక్​ వెర్షన్​లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఈ బుక్ లోని రెండు అద్భుతమైన పేజీలు లీక్ అయినట్లు సమాచారం.లేటెస్ట్ గా లీక్ అయినా పేజీలనే  వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ కూడా ట్విట్టర్ నుంచి పోస్ట్ చేసింది. ఇక ఫ్యాన్స్ అంతా ఈ మూవీ థీమ్ ను, కథను అర్ధం చేసుకుంటున్నారు. 

కలియుగం చివర్లో ప్రజలను ఇబ్బంది పెట్టే రాక్షసుడు ఉంటాడని..అతడిని సంహరించేందుకు దేవుడిలా ప్రభాస్ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. దీనికి సైన్స్ ఫిక్షన్ ను జోడించి నాగ్ అశ్విన్ తనదైన క్రియేటివ్ మైండ్ తో మూవీను తీస్తున్నారు. ప్రాజెక్ట్ K అంటే ఏంటో తెలుసుకోవాలని అనుకున్న ఫ్యాన్స్ ఈ న్యూస్ తో ఏ ఖుషి అవుతున్నారు. 

ఇక మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోయే ఫస్ట్ గ్లింప్స్ కోసం ప్రపంచమంతా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో  ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్ బచ్చన్,  దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్..పలువురు స్టార్ కాస్ట్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే.