ధరణి పోర్టల్ రద్దుకు పోరాడండి : గ్రామీణ యువతకు సీపీఐ మావోయిస్టు లేఖ

ధరణి పోర్టల్ రద్దుకు పోరాడండి : గ్రామీణ యువతకు సీపీఐ మావోయిస్టు లేఖ

ములుగు జిల్లా : ధరణి పోర్టల్ పై సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. ధరణి పోర్టల్ గ్రామీణ భూస్వాములకు వరంగా మారిందని చెప్పారు. తెలంగాణలో దొరల గడీలు, కొత్త రంగులు దిద్దుకునేలా ధరణి పోర్టల్ సహకరిస్తోందని తెలిపారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరో ఉద్యమాన్ని నిర్మించవలసిన రాజకీయ కర్తవ్యం యువత ముందు ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ రద్దుకు యువత పోరాడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ, కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా పోరాడండి అంటూ లేఖలో చెప్పారు.