సండే రష్.. రోడ్లు, మార్కెట్లలో భారీగా రద్దీ

సండే రష్.. రోడ్లు, మార్కెట్లలో భారీగా రద్దీ

రాష్ట్రంలో లాక్ డౌన్ 12 వ రోజు కొనసాగుతోంది. సండే కావడంతో మార్కెట్లలో ఫుల్ రద్దీ కనిపిస్తోంది. కూరగాయల మార్కెట్ లో పాటు నాన్ వెజ్ మార్కెట్లలో పబ్లిక్ పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపులు ఉండడంతో రోడ్లపై కూడా ఎక్కువ రద్దీ ఉంది. నిత్యావసరాలు, కూరగాయల కోసం జనం ఒకేసారి బయటకు వస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా రద్దీనే కనిపిస్తోంది. మెహదీపట్నం గుడిమల్కాపూర్ మార్కెట్లో ఫుల్ రష్ ఉంది. జనం మార్కెట్లలో ఎక్కడా కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉంది. 

ఆదివారం కావటాంతో  నిజామాబాద్ నగరంలోని రోడ్లని రద్దీగా మారాయి. ఉదయం 6 నుంచే నిత్యావసరాల కొనుగోలు కోసం జనం భయటకు వచ్చారు.  దీంతో నగరంలో ప్రధాన మార్కెట్లు, రహదారులు జనంతో రద్దీగా మారాయి. . నగరంలోని అంగడి బజార్, బడాబజార్, గంజ్ కమాన్ ప్రాంతాల్లో జనం గుంపులు గంపులుగా ఉన్నారు. మరిన్ని డీటేల్స్ రజనీకాంత్ అందిస్తారు.