రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు

రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు


రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రేపటి నుండి గరిష్ట ఉష్ణోగ్రతలు, సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2 నుండి 4  డిగ్రీల  సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. నేడు రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.