ఆరోగ్యశాఖ మంత్రిని తొలగించి.. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు

ఆరోగ్యశాఖ మంత్రిని తొలగించి.. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు

హైదరాబాద్: కరోనా కష్ట సమయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారని సీఎం కేసీఆర్ పై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ లీడర్ దాసోజు శ్రావణ్. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా విష పరిస్థితి నెలకొందని..ఫార్మా హబ్ గా పేరొందిన హైదరాబాద్ లో వ్యాక్సిన్, రెమిడెసివర్ తయారవుతున్నా ప్రజలకు దొరకకపోవడం దారుణమన్నారు. కోవిడ్ పేషెంట్ గా సీఎం.. వైద్య శాఖను తన వద్ద పెట్టుకొని ప్రజలను గాలికొదిలేశారన్నారు. నిన్నటి వరకు ఆరోగ్య శాఖ మంత్రికి ఫోన్ చేసి ఇబ్బందులు చెప్పుకునే వాళ్లమని.. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలన్నారు.  సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాస్తున్న.. హేతుబద్ధంగా సలహాలను సూచించామని..ఇకనైనా వైద్యశాఖకు మంత్రిగా ఒక డాక్టర్ కి అప్పగించాలన్నారు.

 వెంటనే స్టేట్ లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలన్న శ్రావణ్.. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాలంటే ఆర్మీ సహాయం తీసుకోవాలన్నారు. కార్పోరేట్ హాస్పిటల్ లు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. స్పెషల్ టాస్క్ పోర్స్ ను ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రజలకు వెంటనే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని చెప్పి 6నెలలు అవుతున్నా ఇంత వరకు అతీగతి లేదన్నారు. బిస్వాల్ కమిటీ చెప్పిన విధంగా ఖాళీగా ఉన్న 25 వైద్య సిబ్బంది నియామకం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు దాసోజు శ్రావణ్.