శంషాబాద్, వెలుగు: ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ ఎదుట బెంగళూరు – హైదరాబాద్ హైవేపై కొందరు ఆకతాయిలు భయానకం సృష్టించారు. ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేస్తూ తోటి ప్రయాణికులను భయాందోళనకు గురిచేశారు. రెండు బైకులపై చేస్తున్న స్టంట్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు యువకులను గుర్తించే పనిలో పడ్డారు. వీరంతా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
