మొతెరా పిచ్‌పై రగడ : వికెట్​ బాగాలేదన్న మాజీ క్రికెటర్లు

మొతెరా పిచ్‌పై రగడ : వికెట్​ బాగాలేదన్న మాజీ క్రికెటర్లు

అహ్మదాబాద్‌‌‌‌: ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌మధ్య రెండ్రోజుల్లోనే ముగిసిన థర్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు ఆతిథ్యమిచ్చిన మొతెరా స్టేడియం పిచ్‌‌‌‌పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు చేశారు. అసలు టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు ఇలాంటి వికెట్‌‌‌‌ ఇస్తారా అంటూ ప్రశ్నించారు. అయితే, లెజెండరీ క్రికెటర్‌‌‌‌ సునీల్‌‌‌‌ గావస్కర్‌‌‌‌ మాత్రం మొతెరా వికెట్‌‌‌‌ను తప్పుబట్టడానికి లేదన్నాడు. బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ అతిగా డిఫెన్స్‌‌‌‌కు పోవడం వల్లే వికెట్లు ఇచ్చుకున్నారన్నాడు. మరోపక్క ఈ పిచ్‌‌‌‌ టెస్టులకు అస్సలు సూటవ్వదని, అందుకే ఇండియా కూడా ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో 145 కే ఆలౌటైందని వీవీఎస్‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌ పేర్కొన్నాడు.

కాగా, ఇలాంటి వికెట్‌‌‌‌పై ఆడితే అనిల్‌‌‌‌ కుంబ్లే, హర్భజన్‌‌‌‌ సింగ్‌‌‌‌ టెస్టుల్లో వరుసగా 1000, 800 వికెట్లు ఈజీగా తీసేవారని యువరాజ్‌‌‌‌ సింగ్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశాడు. మొతెరా పిచ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లకు ఏ మాత్రం సూటవ్వదని హర్భజన్‌‌‌‌ సింగ్‌‌‌‌ అన్నాడు. ఒక వేళ ఇంగ్లండ్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో 200 ప్లస్‌‌‌‌ స్కోరు చేసుంటే అప్పుడు ఇండియా కష్టపడేదని భజ్జీ అభిప్రాయపడ్డాడు.  కాగా,  ఇక మీద కూడా ఇలాంటి వికెట్లే ఇస్తామంటే ప్రతీ జట్టును మూడు ఇన్నింగ్స్‌‌‌‌లు ఆడించాలని ఇంగ్లండ్‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌ మైకేల్‌‌‌‌ వాన్‌‌‌‌  విమర్శించాడు. ఇలాంటి పిచ్‌‌‌‌ వల్ల బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ స్కిల్స్‌‌‌‌కు పరీక్ష ఎదురవుతుందని, ఇది ఈ ఒక్క మ్యాచ్‌‌‌‌కు అయితే ఓకే కానీ తర్వాత కూడా ఇలాంటి వికెట్లే ఇస్తామంటే ఏ క్రికెటర్‌‌‌‌ కూడా ఒప్పుకోడని ఇంగ్లండ్‌‌‌‌ మాజీ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ కెవిన్‌‌‌‌ పీటర్సన్‌‌‌‌ అన్నాడు.