కూతురు మరణం తట్టుకోలేక తల్లి సూసైడ్

V6 Velugu Posted on Dec 20, 2020

దండేపల్లి, వెలుగు: కూతురు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో వెలుగుచూసింది. పోలీసులు,  కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండల కేంద్రానికి చెందిన మడిశెట్టి సాత్విక(14) నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. శుక్రవారం చనిపోయిన సాత్విక తిథి నిర్వహించారు. సాత్వికను మర్చిపోలేక తల్లి కవిత రోదిస్తూ గదిలోనే ఉండిపోయింది. సాయంత్రం కవిత భర్త భరత్ కుమార్ గది తలుపులు తీసేసరికి దూలానికి ఉరి వేసుకొని కనిపించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tagged mother, Died, committed, Manchiryala, suicide, daughter, District, Dandepalli

Latest Videos

Subscribe Now

More News