
వరంగల్ రూరల్ జిల్లా : నర్సంపేట మున్సిపల్ ఆఫీస్ లో రూ.5000 లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిపోయాడు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ రావు. ఆయనతో పాటు జూనియర్ అసిస్టెంట్ కిరణ్ ను కూడా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ల్యాండ్ డెవలప్ మెంట్ అనుమతుల విషయంలో ఓవ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశారు కమిషనర్. ఆ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు ప్లాన్ వేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.