పాట‌లు పాడి సాయం చేసిన చిన్మ‌యి శ్రీ పాద

పాట‌లు పాడి సాయం చేసిన చిన్మ‌యి శ్రీ పాద

సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి శ్రీ పాద మంచి మ‌న‌సు చాటుకుంది. క‌రోనా క‌ష్ట‌కాలంలో పేద‌ల‌కు, వ‌ల‌స కార్మికులకి సాయం చేసేందుకు న‌టీన‌టులు, సింగర్స్ ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చిన్మ‌యి శ్రీ పాద త‌న పాట ద్వారా వ‌చ్చిన మొత్తాన్ని పేద‌ల‌కు సాయం చేసింది. సోష‌ల్ మీడియాలో త‌న అభిమానుల కోరిన పాట‌లు పాడుతూ వ‌చ్చిన మొత్తాన్ని పేదలు, నిరాశ్రయులకు సాయం చేసింది. చాలా వరకు నిధులు ఇచ్చినవారే స్వయంగా సాయమందించేలా కృషి చేసింది.

లాక్ ‌డౌన్‌ ముగిసేవరకు పాట ద్వారా తన సేవలను కొనసాగిస్తానని చెప్పింది చిన్న‌యి. ఇప్ప‌టి వ‌ర‌కు రూ.30 ల‌క్ష‌ల‌కి పైగా నిధులు సేక‌రించిన‌ట్టు తెలిపింది. లాక్ ‌డౌన్ ముగిసే వ‌ర‌కు త‌న పాట‌తో సేవ చేస్తాన‌ని తెలుప‌డంతో.. ఆమె ఔదార్యంపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. దాదాపు 1700కుపైగా పాటలు పాడి, 1100కుపైగా పేద‌ కుటుంబాలకు అండ‌గా నిలిచింద‌ట‌.