సినిమా పేరు ‘వైఫ్’.. ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్

సినిమా పేరు ‘వైఫ్’.. ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్

నరేన్ తేజ్, సుహాన జంటగా  శ్రీనివాస్ (బుజ్జి) దర్శకత్వంలో అధిరా టాకీస్, సినిటారియ మీడియా వర్క్స్ బ్యానర్లపై రూపొందుతోన్న చిత్రం ‘వైఫ్’. శనివారం ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. దర్శకులు సముద్ర, చంద్ర మహేష్, నిర్మాత రామ సత్యనారాయణ అతిథులుగా హాజరై టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

ఇదొక క్రైమ్  సస్పెన్స్ థ్రిల్లర్ అని, ఇందులోని తమ పాత్రలు చాలెంజింగ్‌‌గా ఉంటాయని హీరో హీరోయిన్ అన్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయిందని, త్వరలో మరో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నట్టు దర్శకుడు శ్రీనివాస్ చెప్పాడు.  సినిటారియ మీడియా వర్క్స్ సిఈఓ వెంకట్, డివోపీ మురళీ కృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ సత్య కాశ్యప్ తదితరులు పాల్గొన్నారు.