
TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితులను రెండోసారి కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచింది. ఏ -1 ప్రవీణ్, ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య, ఏ -5 కేతావత్ రాజేశ్వర్ ను కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. సిట్ అధికారులు మూడు రోజుల పాటు నలుగురు నిందితులను విచారించన్నారు.
మార్చి 26వ తేదీ నుండి మంగళవారం వరకు కస్టడీలోకి తీసుకుని సిట్ అధికారులు విచారించనున్నారు. మిగిలిన ముగ్గురి కస్టడీ పిటిషన్ నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఏ-10 షమీమ్, ఏ -11, సురేష్, ఏ -12 రమేష్ ల కస్టడీ పిటిషన్ సోమవారానికి వాయిదా వేసింది.
మొదటిసారి కస్టడీలో తీసుకున్నప్పుడు నిందితులు ఎటువంటి సమాచారాన్ని తెలుపలేదని సిట్ అధికారులు నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పేపర్ లీకేజీలో అరెస్ట్ అయిన నిందితులు పూర్తి సమాచారాన్ని ఇవ్వడం లేదని వివరించారు. పేపర్ లీకేజీలో జరిగిన చైన్ ప్రాసెస్ పై నిందితులు నోరు మెదపడం లేదన్నారు.
కేవలం ముగ్గురి పేర్లు మాత్రమే చెప్పారని, మిగతా వారి పాత్ర బయటపడాల్సి ఉందన్నారు. పేపర్ లీకేజ్ కు ఉపయోగించిన పరికరాలపైనా నిందితులను ప్రశ్నించాలని నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.