విప్రోపై దివాలా పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొట్టిసిన ఎన్సీలాట్​

విప్రోపై దివాలా పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొట్టిసిన ఎన్సీలాట్​

న్యూఢిల్లీ : విప్రో లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దివాలా ప్రక్రియను ప్రారంభించాలంటూ ఆపరేషనల్ క్రెడిటార్ వేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్  కొట్టివేసింది.  గతంలోనే విప్రో,  పిటిషనర్ మధ్య చెల్లింపుపై  వివాదం ఉందని అప్పీలేట్ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇద్దరు సభ్యుల చెన్నై బెంచ్ పేర్కొంది.  ఈ కేసుకు దివాలా కోడ్​ వర్తించదని స్పష్టం చేసింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీలాట్​) ఎన్సీఎల్టీ  ఉత్తర్వును సమర్థించింది. అంతకుముందు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంగళూరు బెంచ్ జనవరి 16, 2020 న,  ఆపరేషనల్​ క్రెడిటార్​ హోదాలో ​ ట్రైకోలైట్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో ఈ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఎన్సీలాట్​లో సవాల్​ చేసింది. 

ఇన్​వాయిస్​ మొత్తంలో మూడు శాతం మొత్తం గురించే వివాదం నడుస్తోందని పేర్కొంది.  కేసులో స్పష్టత ఉంటేనే కార్పొరేట్​ బారోవర్​పై​ దివాలా కోడ్​ ప్రకారం చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని స్పష్టం చేసింది. ఇక్కడ అప్పు విషయంలో పార్టీల మధ్య తీవ్రమైన వివాదం లేదని అభిప్రాయపడింది. విప్రో చేపట్టిన ఒక ప్రభుత్వ ప్రాజెక్ట్ కోసం వస్తువుల సరఫరాకు సంబంధించి ట్రైకోలైట్​తో వివాదం ఏర్పడింది.