
హైదరాబాద్, వెలుగు: మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ను ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాట్లు చేసింది. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5:20 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. మన రాష్ట్రం నుంచి 50 వేల మంది స్టూడెంట్లు ఈ ఎగ్జామ్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 23 జిల్లాలలో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్‌కు కనీసం గంట ముందే చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. మధ్యాహ్నం 1:30 గంటలకు సెంటర్ గేట్లు క్లోజ్ చేస్తారు.