
5జీ సేవలు అందించడంలో ఎయిర్‌టెల్ మరో మైలు రాయిని చేరుకుంది. 5జీ సేవలు ప్రారంభించిన 30 రోజుల్లోనే 1 మిలియన్ (10 లక్షల) సబ్స్ స్క్రైబర్లను సాధించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసిలో ఎయిర్ టెల్ తన మొదటి 5జీ సేవలను ప్రారంభించింది.
అక్టోబర్ 6న 5జీని ప్రారంభించినప్పటినుంచి, తన నెట్‌వర్క్‌లో 1 మిలియన్ 5జీ యాక్టివ్ యూజర్స్ మార్క్‌ను దాటింది. 5జీని వాణిజ్యపరంగా ప్రారంభించిన మొదటి ఆపరేటర్ ఎయిర్ టెలే. నెట్‌వర్క్ ప్రారంభమైన అతి తక్కువ టైంలో ఈ మైలురాయిని సాధించి రికార్డ్ నెలకొల్పింది ఎయిర్ టెల్. మిగిలిన నగరాల్లో కూడా తన సేవలు త్వరలోనే తీసుకురానుంది. అయితే 5జీ రోల్ అవుట్ చేసిన నగరాల్లో ఉన్నవాళ్లు ఎయిర్ టెల్ 4జీ వాడుతుంటే 5జీ కోసం సిమ్ మార్చాల్సిన పనిలేదు. వాడేది 5జీ ఫోన్ అయితే సరిపోతుంది.