జై శ్రీరాం : ఆరు ఇంచుల నుంచి ఎనిమిది అడుగుల వరకు.. శ్రీరాముడి విగ్రహం

జై శ్రీరాం : ఆరు ఇంచుల నుంచి ఎనిమిది అడుగుల వరకు.. శ్రీరాముడి విగ్రహం

అయోధ్య రాముడు ఎలా ఉన్నాడు.. ఎంత ఉన్నాడు.. ఇప్పుడు ఇదే భక్తులకు ఆసక్తి. అయోధ్య గర్భగుడిలో కొలువయ్యే శ్రీ రాముడు ఎనిమిది అడుగులు ఉన్నాడు.. 200 కేజీల బరువు ఉన్నాడు.. వాస్తవంగా కొన్ని దశాబ్దాలుగా అయోధ్యలో పూజలు అందుకుంటున్న బాల రాముడు విగ్రహం ఎత్తు కేవలం ఆరు ఇంచులు మాత్రమే.. అదే విధంగా సీత, లక్ష్మణ, శత్రుష్ను, హనుమంతుని విగ్రహాలు సైతం చాలా చిన్నవి. ఇంచుల్లో ఉన్నాయి.. అయోధ్యలో కొత్తగా కట్టిన గుడిలో.. భక్తుల సౌకర్యార్థం.. దర్శనం కోసం.. విగ్రహం ఎత్తును ఆరు ఇంచుల నుంచి ఎనిమిది అడుగులకు పెంచారు. దివ్య మంగళ స్వరూపంగా ఈ బాల రాముడు దర్శనం ఇవ్వనున్నాడు.

అయోధ్య గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరిగే విగ్రహం ఎత్తు 8 అడుగులు ఉంది. దీనికే ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని పూజారులు, పండితులు ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. అయోధ్యలో ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆరు ఇంచుల విగ్రహం సైతం.. ఉత్సవ మూర్తిగా.. ఊరేంగిపుల సమయంలో ఈ ఆరు ఇంచుల విగ్రహాన్ని ఊరేగించనున్నారు పండితులు. తిరుమలలో ఎలా అయితే ఉత్సవ విగ్రహాలు.. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు దర్శనం ఇస్తాయో.. అలాగే ఆరు ఇంచుల విగ్రహ మూర్తులు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాయి. ఇక గర్భగుడిలోని శాశ్వత విగ్రహం.. నిత్యం భక్తులకు ఆలయంలో దర్శనం ఇవ్వనుంది. 

మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన 8 అడుగుల విగ్రహానికే ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఇతను గతంలో కేధార్ నాథ్ లోని ఆది శంకరాచార్య, ఇండియా గేట్ దగ్గర ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను తయారు చేశారు. ప్రస్తుతం అయోధ్యలో ప్రాణం పోసుకోనున్న 8 అడుగుల రాముడి విగ్రహం సైతం ఇతని చేతుల మీదుగా తయారైంది. పెద్ద కళ్లు, జీవం ఉట్టిపడే విధంగా శ్రీరాముడి విగ్రహం ఉందని అయోధ్య ఆలయ ట్రస్ట్ అధికారులు చెబుతున్నారు.