ఆర్ఆర్ఆర్లో 11 ఇంటర్ ఛేంజ్లు

ఆర్ఆర్ఆర్లో 11 ఇంటర్ ఛేంజ్లు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు 11 చోట్ల ఇంటర్ ఛేంజ్ లను ఎన్​హెచ్ఏఐ ఖరారు చేసింది.  ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికుల కోసం ఫ్లై ఓవర్లను నిర్మించనున్నారు. అదేవిధంగా సింగిల్​, డబుల్​ ట్రంపెట్లు (హైవే మీదకు ఎక్కడం లేదా దిగడం), ఓఆర్ఆర్ లా ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్ హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఈ 11 ఇంటర్ ఛేంజ్​లు రాష్ర్టంలోని పలు నేషనల్ హైవేలకు సమీపంలోని గ్రామాల దగ్గర నిర్మించనున్నారు.