పొగరాయుళ్లు తగ్గుతున్నారట!

పొగరాయుళ్లు తగ్గుతున్నారట!

సిగరెట్, బీడీ తాగే పురుషుల సంఖ్య తగ్గుతోందని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పొగ తాగే ప్రతి ఐదుగురిలో నలుగురు పురుషులే ఉండగా, ఇప్పుడా సంఖ్య తగ్గుముఖం పడుతోందని డబ్ల్యూహెచ్ఓ​ హెడ్ ​డాక్టర్​ టెడ్రోస్​ అధనామ్ ​చెప్పారు. టొబాకోకు వ్యతిరేకంగా చేస్తున్న ఫైట్​లో ఇదో టర్నింగ్​ పాయింట్​గా పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఓ రిపోర్టును విడుదల చేశారు. అయితే ఇందులో ఈ–సిగరెట్​కు సంబంధించిన వివరాలు లేవు. వీటిని వచ్చే ఏడాది విడుదల చేస్తామని డబ్ల్యూహెచ్​ వర్గాలు తెలిపాయి. 2000 సంవత్సరం నుంచి పొగతాగే మహిళల సంఖ్య తగ్గగా, పురుషులు మాత్రం పెరిగారు. అయితే పోయిన ఏడాది నుంచి వీరి సంఖ్య కూడా తగ్గుతోందని రిపోర్టులో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 130 కోట్ల మంది పొగ తాగుతున్నారు. వచ్చే ఏడాది వరకు 10 లక్షలు, 2025 వరకు 50 లక్షల మంది పొగతాగే మగవారి సంఖ్య తగ్గుతుందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది. స్మోక్​లెస్​ టొబాకోను వినియోగిస్తుండడంతో వీరి సంఖ్య తగ్గుతోందని పేర్కొంది.