60 శాతం తగ్గిన హోటల్​ మేనేజ్​మెంట్​ కాలేజీలు

60 శాతం తగ్గిన హోటల్​ మేనేజ్​మెంట్​ కాలేజీలు
  • తెలంగాణ చెఫ్స్​ అసోసియేషన్ వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: దేశవ్యాప్తంగా చెఫ్​లకు కొరత ఏర్పడనుందని తెలంగాణ చెఫ్స్​ అసోసియేషన్​ వెల్లడించింది.  హాస్పిటాలిటీ ఇండస్ట్రీని 2023–24 నాటికి చెఫ్స్​ కొరత వేధించే ఛాన్స్​ ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని కలినరీ ఎడ్యుకేటర్స్​ను టీచర్స్​ డే సందర్భంగా చెఫ్స్​ అసోసియేషన్​ సత్కరించింది. హాస్పిటాలిటీ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై ఈ సందర్భంగా తెలంగాణలోని హోటల్​ మేనేజ్​మెంట్​ ఇన్​స్టిట్యూట్స్​తో కలిసి చర్చించింది. దేశంలోని హోటల్​ మేనేజ్​మెంట్​ కాలేజీలు, యూనివర్శిటీలలో స్టూడెంట్స్​ సంఖ్య 2022 నాటికి 60 శాతం తగ్గిపోయినట్లు పేర్కొంది. ఇదే ట్రెండ్​ కొనసాగితే ఇబ్బందులు తప్పవని వెల్లడించింది.