రాష్ట్రంలో ఒకే ఒక్క డెయిరీ కాలేజీ.. నో ఫండ్స్ & నో డెవలప్​

రాష్ట్రంలో ఒకే ఒక్క డెయిరీ కాలేజీ.. నో ఫండ్స్ & నో డెవలప్​
  • స్టేట్​ డివైడ్​ అయ్యాక నామమాత్రంగా కామారెడ్డి కాలేజీ
  • 12 మందికి నలుగురే రెగ్యులర్ ​ప్రొఫెసర్లు
  • పీజీ కోర్సులు లేక పైచదువులకు దూరమవుతున్న స్టూడెంట్లు

కామారెడ్డి, వెలుగు: రాష్ట్రంలోని ఏకైక డెయిరీ కాలేజీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంది. స్టేట్​ డివైడ్​ అయినప్పటి నుంచి ఇది సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కొన్నేండ్ల క్రితం బీఎస్సీ కోర్సును బీటెక్​గా అప్​గ్రేడ్ ​చేసినప్పటికీ దానికి అనుగుణంగా ప్రొఫెసర్లు, స్టాఫ్​ సంఖ్యను పెంచలేదు. రిటైర్ ​అయిన వారి స్థానంలో రెగ్యులర్​ప్రొఫెసర్లను నియమించకుండా  కాంట్రాక్ట్​ లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. పీజీతోపాటు మరికొన్ని డెయిరీ కోర్సులు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నా స్టేట్ ​గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు.

బీఎస్సీ నుంచి బీటెక్​గా..

కామారెడ్డి గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీలో మొదట మూడేళ్ల బీఎస్సీ డెయిరీ కోర్సు మాత్రమే ఉండేది. దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించేది. ఆ తర్వాత పీజీ చేసేందుకు స్టేట్ లో ఈ కోర్సుకు సంబంధించిన కాలేజీనే లేదు. స్టూడెంట్స్​ పై చదువులకు వెళ్లేందుకు చాన్స్ ​లేకుండా పోయింది. సుదీర్ఘ పోరాటం తర్వాత వర్సిటీ 2003లో బీఎస్సీని బీటెక్ డెయిరీ కోర్సుగా మార్చింది. ఎంసెట్ ద్వారా  ప్రవేశాలు కల్పించింది. కానీ ఆ తర్వాత ఓయూ అడ్మిషన్లు చేపట్టలేదు. ఒక్కగానొక్క కాలేజీలో ఈ ఒక్క కోర్సు నిర్వహణ భారంగా మారిందని ఆపేసింది. దీంతో స్టూడెంట్లంతా మరోసారి ఆందోళన చేశారు. 2005లో  కోర్సును తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సెపరేట్ కాలేజీగా..

ఉమ్మడి రాష్ట్రంలో బీటెక్​  డెయిరీ కోర్సులు కేవలం కామారెడ్డి, తిరుపతిలోనే ఉండేవి. కానీ కామారెడ్డిలో ఈ కోర్సుకు సపరేట్​ కాలేజీ బిల్డింగ్, హాస్టళ్లు, మినీ డెయిరీ ప్లాంట్ ఇవేం లేవు. ఈ నేపథ్యంలో వాటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 కోట్ల ఫండ్స్​తోపాటు 60 ఎకరాల స్థలం కేటాయించింది. నిర్వహణ మొత్తం ఎస్వీ యూనివర్సిటీ చూసేది. స్టేట్​డివైడ్​ అయ్యాక పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది. ఎంసెట్​ద్వారా ఏటా 35 మంది స్టూడెంట్లు జాయిన్ ​అవుతున్నారు. నేషనల్ ​కోటాలో ఇతర రాష్ట్రాల స్టూడెంట్లు వస్తుంటారు.

డీన్, నలుగురు ప్రొఫెసర్లే..

కాలేజీలో12 ప్రొఫెసర్​ పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా బీఎస్సీ డెయిరీ కోర్సు ఉన్నప్పటి పోస్టులే. ప్రస్తుతం వాటిలో డీన్​, నలుగురు ప్రొఫెసర్లే రెగ్యులర్. మిగతా ఏడుగురు కాంట్రాక్ట్​లెక్చరర్లే. బీఎస్సీ నుంచి అప్​గ్రేడ్ ​అయ్యాక రెగ్యులర్​ ప్రొఫెసర్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. కానీ పెంచలేదు. దానికితోడు ఉన్న 12 ఖాళీల్లో రిటైర్​ అయితే ప్రభుత్వం కొత్తవారిని నియమించడం లేదు.

పీజీ కోర్సులకు చాన్స్​ఉన్నా..

డెయిరీ కాలేజీలో పాలిటెక్నిక్, పీజీ కోర్సులతోపాటు ఇతర కోర్సులు ప్రవేశపెట్టడానికి అవసరమైన వనరులు ఉన్నాయి. 60 ఎకరాల స్థలం ఉంది. బిల్డింగ్స్, హాస్టళ్లు, ల్యాబ్స్ నిర్మాణాలకు కావాల్సినంత స్పేస్​ ఉంది. సర్కారు పట్టించుకుంటే అగ్రికల్చర్​కు అనుబంధంగా డెయిరీ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం బీటెక్​కంప్లీట్ కాగానే పీజీ కోసం స్టూడెంట్స్​ గుజరాత్, హర్యానా స్టేట్స్​ వెళ్తున్నారు. పేద స్టూడెంట్లయితే ఇక్కడితోనే చదువును ఆపేస్తున్నారు. పీజీ కోర్సు స్టార్ట్ ​చేస్తే స్టేట్​లో పాడి పరిశ్రమను పెంచొచ్చు.

ప్రొఫెసర్ల ఖాళీలు

డెయిరీ టెక్నాలజీలో 4, డెయిరీ కెమిస్ట్రీలో 4, ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌, మైక్రోబయోలజీ, బిజినెస్‌‌‌‌ ‌‌‌‌మెనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ ‌‌‌‌కోసం ఒక్కో విభాగంలో ఇద్దరేసి ప్రొఫెసర్లు కావాల్సి ఉంది. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్​ నీడ్​ఉంది. అవుట్​ సోర్సింగ్​ పద్ధతిలో నాన్​టీచింగ్ ​స్టాఫ్​ని నియమిస్తున్నారే తప్ప రెగ్యులర్​ స్టాఫ్ ని ప్రభుత్వం నియమించడం లేదు.

ఇవి కూడా చదవండి..

ఉచిత తాగునీటి పథకం.. క్షేత్రస్థాయిలో అంతా గందరగోళం

కోడ్ కూస్తదేమోనని.. పనుల్లో స్పీడ్.. క్వాలిటీ అడగొద్దు

సీఎం ఎంట్రీతో సీన్​ మారేనా?

సీల్డ్ కవర్​లో మేయర్ పేరు.. ఆశావహుల్లో టెన్షన్