The Paradise OTT: ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

The Paradise OTT: ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

‘ది ప్యారడైజ్’ మూవీ ఇంకా పలు థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మంచి రన్‌ను కొనసాగిస్తోంది. ఓ వైపు థియేటర్లలో లాంగ్ రన్ కొనసాగిస్తుండగానే.. మరోవైపు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్  ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం. 

‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్‌పై కొత్త టాక్..

‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్‌పై గత వారం ఓ ఆసక్తికరమైన టాక్ వైరల్ అయ్యింది. నవంబర్ మొదటి వారంలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో కొత్త స్ట్రీమింగ్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అక్టోబర్ 23, 2026 నుంచి ‘ది ప్యారడైజ్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

థియేటర్లలో మిస్ అయిన నాని అభిమానులు, అలాగే సినిమాను మరోసారి చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ అప్డేట్ ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ లేదా చిత్రబృందం నుంచి అధికారికంగా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. దీంతో అక్టోబర్ 23న స్ట్రీమింగ్ అవుతుందనే వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరోవైపు నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’పై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు థియేట్రికల్ రన్ అలోమోస్ట్ పూర్తవడంతో ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా...

శ్రీకాంత్ ఓదెల- నాని కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. వసూళ్ల పరంగా మాత్రం మంచి జోరు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.170 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు సినీ వర్గాల సమాచారం. తొలి రోజే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం సెకండ్ వీక్‌లోనూ ‘ది ప్యారడైజ్’కు టికెట్లు బుక్ అవుతున్నాయి.