మా లీడర్లను పోలీసులు వేధిస్తున్నరు : సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు

మా లీడర్లను పోలీసులు వేధిస్తున్నరు : సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు
  • మా లీడర్లను పోలీసులు వేధిస్తున్నరు
  • చర్యలు తీసుకోవాలని సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు 

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ లీడర్లను పోలీసులు వేధిస్తున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్​కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎలాంటి కేసులు లేకపోయినా నాయకులను, కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిచి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. సీఈవోకు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ జి. నిరంజన్ మంగళవారం ఈ మేరకు లేఖ రాశారు. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో పార్టీ నేతలు ఎవరూ సమావేశం పెట్టరాదంటూ అక్కడి ఇన్​స్పెక్టర్ ​అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల టైంలో పార్టీ ఆఫీసు నుంచి ప్రచార సామగ్రిని తీసుకెళ్లేందుకు నేతలు, కేడర్ రావడం సహజమేనని తెలిపారు. 

కార్యకర్తలను పార్టీ ఆఫీసుకు రావొద్దంటూ వార్నింగ్​లు ఇస్తున్న ఇన్​స్పెక్టర్​పై చర్యలు తీసుకోవాలని కోరారు. నామినేషన్లకు హెల్ప్ డెస్క్​లు పెట్టాలని మరో లేఖలో సీఈవోను కోరారు. పలువురు అభ్యర్థుల నామినేషన్లలో తప్పులొచ్చాయని, రిటర్నింగ్ ఆఫీసుల వద్ద ఆ తప్పులను సరిచేసేందుకు హెల్ప్ డెస్క్​లు లేవన్నారు. నామినేషన్లకు గడువు ఇంకో మూడ్రోజులే ఉన్నందున హెల్ప్ డెస్క్​లు పెట్టాలని కోరారు.