T20 World Cup 2026: రిజ్వాన్, రౌఫ్‌లపై వేటు.. బాబర్, అఫ్రిది బ్యాక్: వరల్డ్ కప్‌కు పాకిస్థాన్ స్క్వాడ్ ప్రకటన

T20 World Cup 2026: రిజ్వాన్, రౌఫ్‌లపై వేటు.. బాబర్, అఫ్రిది బ్యాక్: వరల్డ్ కప్‌కు పాకిస్థాన్ స్క్వాడ్ ప్రకటన

ఇండియాలో పాకిస్థాన్ వరల్డ్ కప్ ఆడుతుందా లేదా అనే సస్పెన్స్ కు తెరపడింది. పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతిస్తేనే తాము వరల్డ్ కప్ ఆడతామని శనివారం (జనవరి 24) పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ జట్టులాగే పాకిస్థాన్ కూడా వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటుందేమో అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే పుకార్లకు చెక్ పెడుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇండియా, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆదివారం (జనవరి 25) ప్రకటించింది. 

పాకిస్థాన్ జట్టుకు సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీ చేయనున్నాడు. సీనియర్ ప్లేయర్స్ బాబర్ అజామ్, షహీన్ అఫ్రిది తిరిగి జట్టులోకి వచ్చారు. ఎక్స్‌ప్రెస్ పేసర్ హారిస్ రౌఫ్‌ను 15 మంది సభ్యుల జట్టు నుండి తొలగించారు. రౌఫ్‌ తో పాటు జట్టులో స్థానం కోసం పోరాడుతున్న రిజ్వాన్ కూడా స్థానం దక్కించుకోలేకపోయాడు. ఖవాజా మహ్మద్ నఫాయ్, ఉస్మాన్ ఖాన్, సాహిబ్జాదా ఫర్హాన్ రూపంలో ముగ్గురు వికెట్ కీపర్లు జట్టులో ఉన్నారు. సీనియర్ ప్లేయర్ ఫకర్ జమాన్ కు జట్టులో స్థానం దక్కింది.  

 వరల్డ్ కప్ ముందు పాకిస్థాన్ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు శుక్రవారం (జనవరి 23) 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. జనవరి 29 నుంచి ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. కొంతకాలంగా పాకిస్థాన్ టీ20 జట్టుకు దూరంగా ఉన్న అఫ్రిది జట్టులో చేరాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు జనవరి 24న లాహోర్‌లో సమావేశమవుతుందని.. మరుసటి రోజు నుండి ప్రాక్టీస్ ప్రారంభమవుతుందని ఆ దేశ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు జనవరి 28న పాకిస్థాన్ లో అడుగుపెట్టనుంది. 

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు పాకిస్థాన్ జట్టు: 

సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్ , ఫఖర్ జమాన్, ఖవాజా మహ్మద్ నఫాయ్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్     

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ షెడ్యూల్:  

ఫిబ్రవరి 7 - కొలంబోలో పాకిస్తాన్ vs నెదర్లాండ్స్

ఫిబ్రవరి 10 - కొలంబోలో పాకిస్తాన్ vs అమెరికా

ఫిబ్రవరి 15 - కొలంబోలో భారత్ vs పాకిస్తాన్

ఫిబ్రవరి 18 - కొలంబోలో పాకిస్తాన్ vs నమీబియా