సొంత డబ్బుతో రోడ్డును బాగు చేసుకున్నరు

సొంత డబ్బుతో రోడ్డును బాగు చేసుకున్నరు

మంచిర్యాల జిల్లా: రోడ్డు మరమ్మతు కోసం ప్రజా ప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన పనికాకపోవడంతో... విసిగి వేసారిన ప్రజలు సొంత డబ్బుతో రోడ్డును బాగు చేసుకున్నారు. ఈ ఘటన జిల్లోలోని కోనంపేట గ్రామంలో జరిగింది. నెన్నల్ మండలానికి 6 కిలోమీటర్ల దూరంలోని కోనంపేటలో 350 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఐతే గ్రామంలో రోడ్లు, సరైన వసతులు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షం కురిసినా రోడ్లు బురదమయంగా మారుతుండటంతో నడవలేక నరకం చూస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదిలేక గ్రామంలోని మహిళలు ఇంటికి 500 రూపాయలు చొప్పున వసూలు చేసి... ట్రాక్టర్లతో మట్టి తీసుకొచ్చుకుని రోడ్లు మరమ్మతు చేసుకున్నారు.