హైదరాబాద్ లో డ్రోన్ ఎగరేసి చూసినా దొరకని దినేశ్ ఆచూకీ

హైదరాబాద్ లో  డ్రోన్ ఎగరేసి చూసినా దొరకని దినేశ్ ఆచూకీ
  •     వినోభానగర్​ నాలా ఘటనలో కొనసాగుతున్న గాలింపు 
  •     మూసీలో డ్రోన్ ఎగుర‌‌‌‌వేసిన హైడ్రా అర్జున్, రామ కూడా కనిపించలే..

ముషీరాబాద్/ మెహిదీపట్నం : నగరంలోని అఫ్జల్​సాగర్, ముషీరాబాద్​వినోభానగర్​నాలాలో ఆదివారం గల్లంతైన వారి ఆచూకీ ఇంకా దొరకలేదు. ఆదివారం రాత్రి వినోభానగర్​నాలాలో గల్లంతయిన దినేశ్​కోసం హైడ్రా, డీఆర్ఎఫ్, బల్దియా , రెవెన్యూ బృందాలు మంగ‌‌‌‌ళ‌‌‌‌వారం మూసీ గాలించాయి. హైడ్రా డ్రోన్ తో మూసీ ప‌‌‌‌రివాహ‌‌‌‌క‌‌‌‌మంతా పరిశీలించినా ప్రయోజ‌‌‌‌నం లేకుండా పోయింది. 

దినేశ్​టూ వీలర్​ను ఆయన గల్లంతయిన చోటు నుంచి 150 మీట‌‌‌‌ర్ల దూరంలో గుర్తించి వెలికి తీశారు. బైకు దొరికిన చోటు నుంచి ఘటన జ‌‌‌‌రిగిన ప్రాంతం వ‌‌‌‌ర‌‌‌‌కూ ప్రతి క్యాచ్‌‌‌‌పిట్‌‌‌‌ తెరిచి, భూగ‌‌‌‌ర్భ డ్రైనేజీ మార్గంలో వెళ్లి వెతికినా దినేశ్​జాడ దొర‌‌‌‌క‌‌‌‌లేదు. ఆసిఫ్ నగర్ మాంగర్​బస్తీ అఫ్జల్సాగర్ నాలాలోని కొట్టుకపోయిన అర్జున్, రామ ఆచూకీ కూడా ఇంకా దొరకలేదు. హైడ్రా, పోలీసులు, బల్దియా సిబ్బంది మంగళవారం మూసీ నది వరకు గాలించారు. అయినా, ఎక్కడా వారి ఆచూకీ లభించలేదు. మరోవైపు బాధిత కుటుంబసభ్యులను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య పరామర్శించారు.