ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువున్నా పోటీకి ఓకే!

ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువున్నా పోటీకి ఓకే!
  • మున్సిపల్ చట్టాని కి సవరణలు
  • ఇద్దరు పిల్లల కంటే ఎక్కువుంటే అనర్హులన్న నిబంధన ఎత్తివేత
  • బిల్లుకు మండలి ఆమోదం

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా మున్సి పల్ ఎలక్షన్లలో పోటీ చేయవచ్చు. తాజాగా మున్సిపల్ చట్టం లో తెచ్చిన సవరణల్లో ఇందుకు అవకాశం కల్పిం చారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హులన్న నిబంధనను ఎత్తివేశారు. మున్సి పల్ యాక్ట్‌‌‌‌  సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ ఆదివారం మండలిలో ప్రవేశపెట్టారు. తర్వాత జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మున్సి పల్ చట్టం లోని 1, 3, 103, 113ఏ,195ఏ సెక్ష న్లకు సవరణలు చేస్తు న్నట్టు తెలిపారు.

బర్త్​ రేట్ తగ్గింది..

కాంగ్రె స్ సభ్యుడు జీవన్ రెడ్డి ‘ఇద్దరు పిల్లల’ నిబంధన అంశాన్ని ప్రస్తావిం చారు. సవరణల్లో ఆ రూల్ ను ఎందు కు తొలగించారని ప్రశ్నించారు. దానిపై స్పందిం చిన కేటీఆర్.. ఒకప్పటి జనాభా పరిస్థితికి అనుగుణంగా ఆ నిబంధనను తీసుకొచ్చారని, ఇప్పుడా అవసరం లేదని బదులిచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర బర్త్‌‌‌‌ రేట్‌‌‌‌ 1.7గా ఉందని గుర్తు చేశారు. ఇటీవలే రూపొందించిన పంచాయతీ రాజ్‌‌‌‌ చట్టం లో ‘ఇద్దరు పిల్లల పరిమితి’ నిబంధన ఉందని జీవన్‌‌‌‌రెడ్డి ప్రస్తావిం చారు. మున్సి పాలిటీలకే ఈ నిబంధన తొలగించడం సరికాదన్నా రు.

‘పర్మిషన్’ పై వారంలో తేలిపోతుంది

దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా భవన నిర్మాణాలకు అనుమతివ్వాలని మున్సిపల్ యాక్ట్‌‌‌‌లో చేర్చారని.. అలాంటి నిబంధనలెన్ని ఉన్నా అధికారులు ఏదో సాకు చూపి 18వ రోజో, 19వ రోజో అప్లికేషన్‌‌‌‌  రిజెక్ట్ చేస్తారని ఎమ్మెల్యే భాను ప్రసాద్‌ రావు, పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మరికొందరు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ నిర్మాణానికి అనుమతి తీసుకునేందు కు తనకు ఆరేండ్లు పట్టిందని పల్లా చెప్పా రు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. దరఖాస్తు చేసుకున్న వారంలోపే రిజెక్ట్‌‌‌‌ చేయాలని, లేనిపక్షంలో 21 రోజుల్లో అనుమతించాలని చట్టం లో పొందు పర్చామని వివరించారు. వారం రోజుల తర్వాత రిజెక్ట్ చేయడానికి నిబంధనలు ఒప్పుకోవని స్పష్టం చేశారు.

‘తొలగింపు’ అధికారం సరికాదు

మున్సి పల్ చట్టం లోని ప్రజాప్రతినిధుల తొలగింపు సెక్షన్‌‌‌‌ అభ్యం తరకరంగా ఉందని బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు అన్నా రు. మున్సి పల్ కౌన్సి లర్, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌, చైర్మన్‌‌‌‌లను తొలగించే అధికారం దారుణమన్నా రు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌ స్పందిస్తూ ..భయం ఉంటేనే ఎవరైనా బాధ్యతగా పని చేస్తా రన్నా రు. సభ్యుల తొలగింపు అధికారం దుర్వినియోగం అవకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

ఫ్లెక్సీలు కడితే లీడర్లు అవరు

ఫంక్షన్‌‌‌‌ హాళ్లలో ప్లాస్టిక్‌‌‌‌  వినియోగాన్ని నిషేధించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి కోరారు. ఫ్లెక్సీ లను వ్యతిరేకించే మున్సి పల్ మంత్రి ఫ్లెక్సీలే హైదరాబాద్​ అంతటా కనిపిస్తున్నా యన్నా రు. దీనిపై స్పందిం చిన కేటీఆర్.. ఫ్లెక్సీ లు కట్టి కొందరు లీడర్లు అవుదామనుకుంటున్నా రని, ఫ్లెక్సీ లకు తాను వ్యతిరేకమని చెప్పా రు. ఫ్లెక్సీ లు కట్టినంత మాత్రాన నాయకులుగా ఎదగరన్నారు.

రోడ్లపై ఉన్న నిర్మాణాలు తొలగించాలె

రోడ్లపై ఉన్న ప్రార్థనా మందిరాలు, విగ్రహాలు,ఇతర కట్టడా లను తొలగించాలని ఎమ్మెల్సీ లు నర్సిరెడ్డి, పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, భాను ప్రసాద్‌ రావు, కర్నె ప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు. కేటీఆర్ సమాధానమిస్తూ .. అన్ని పార్టీలూ ఒప్పుకుంటే తొలగింపుకు సిద్ధం గా ఉన్నా మని చెప్పా రు. గతంలో తాము ఈ ప్రయత్నం చేశామని.. హైదరాబాద్‌ , సికింద్రాబాద్‌ ఎంపీలుగా ఉన్న అసదుద్దీన్‌‌‌‌ ఒవైసీ, బండారు దత్తాత్రేయ ఒప్పుకున్నారని వెల్లడించారు. అయితే ఇద్దరూ కూడా అవతలిపక్షం వాళ్లవి ముందు తొలగించాలని మెలిక పెట్టడంతో ప్రతిపాదన ముందుకు సాగలేదన్నారు.

the person who had more than two children can compete in municipal elections