వికారాబాద్, వెలుగు: వినాయకులకు ఉన్న ఇనుప సీకులను తీసేందుకువెళ్లిన ఓ వ్యక్తి చెరువులో పడి చనిపోయాడు. వికారాబాద్ పరిధిలోని మోమిన్ పేట మండలం దుర్గంచెరువుకు చెందిన పెద్ద గొల్ల అనంతయ్య (42) కొన్ని రోజులుగా కొత్తగడిలో భార్య పిల్లలతో కలిసి ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నాడు. కొంపల్లి చెరువులో నిమజ్జనం చేసిన వినాయకుల ఇనుప సీకులను తీసేందుకు గురువారం వెళ్లాడు. ఈ క్రమంలో నీటిలో మునిగి చనిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.